కోహీర్, ఆగస్టు 5 : చిరాగ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జూలై 26న జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేశామని ఎస్పీ రూపేశ్ వెల్లడించారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ముంబయికి చెందిన నగల వ్యాపారి విశాల్ జైన్ తన గుమస్తా ఆశిష్ జైన్‌కు హైదరాబాద్‌లో విక్రయించేందుకు 5కిలోల బంగారం అప్పగించాడు. అతడు హైదరాబద్‌కు వచ్చి 2.100 కిలోల బంగారం విక్రయించి మిగతా 2.900 కిలోల బంగారంతో ముం బయికి పయనమయ్యాడు.
ఆరెంజ్ ట్రావెల్స్‌లో ముంబయికి వెళ్తున్న క్రమంలో సత్వార్ సమీపంలోని కోహీనూర్ దాబా వద్ద భోజనం కోసం కిందకు దిగాడు. తర్వాత బస్సులోకి వెళ్లి చూసే సరికి బంగారంతో ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం వారం రోజుల నుంచి గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి బూ ర్దిపాడ్ సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. బ్రిజ్జా కారులో అనుమానాస్పదంగా ఉన్న ముస్తాక్ఖాన్ను విచారించగా జహీరాబాద్ దాబాల్లో మరోసారి చోరీ చేసేందుకు వచ్చామని తెలిపాడు. తామే బంగారం చోరీ చేసినట్లు అంగీకరించాడు. మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లా దార్వార్పురాకు చెందిన అష్రాఫ్, ఫెరోజ్, సాజిద్ పారిపోయారు.
ముస్తాక్‌ఖాన్ వద్ద ఉన్న బ్యాగును సోదా చేయగా అందులో 2.900కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.3.10 కో ట్లు ఉంటుందని వెల్లడించారు. డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ శివలింగం, ఎస్సైలు కాశీనాథ్, రాజేందర్‌రెడ్డి, శ్రీపాదరావు, రామానాయుడు, శ్రీకాంత్, సిబ్బంది లక్ష్మారెడ్డి, జైపాల్‌రెడ్డి, రెఖ్యా, రశీద్, సయ్యద్ అస్లాం, రాజశేఖర్, అన్వర్ పాషా, శశిధర్ తదితరులు కలిసి వాహన తనిఖీల్లో పాల్గొన్నారన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 300మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశామని ఎస్పీ వెల్లడించారు.