మెదక్ మున్సిపాలిటీ, మార్చి 30: టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో మెదక్‌కు చెందిన శైలేశ్ రాష్ట్రస్థాయిలో 900 మార్కులకు 503 (41వ ర్యాంక్) సాధించాడు. శైలేశ్ విద్యాభ్యా సం నర్సరీ నుంచి 7వర కు మెదక్, 8 నుంచి పదో తరగతి వరకు తూప్రాన్‌లోని అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్మీడియొట్ హైదరాబాద్‌లోని నారాయణ ఐఏఎస్ అకాడమీ, డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీలో కొనసాగింది. శైలేశ్ తండ్రి పూన రవి మెదక్‌లో నగల దుకాణం నిర్వహి స్తున్నాడు. ఆదివారం టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల ర్యాంకులు ప్రకటించగా శైలేశ్ 41వ ర్యాంక్ సాధించాడు.
మెరిసిన అఖిల్
కొండపాక(కుకునూరుపల్లి), మార్చి 30 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల్లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని బందారం గ్రామానికి చెందిన నర్రా వజ్రమ్మ-భగవాన్‌రెడ్డి దంపతుల కుమారుడు నర్రా అఖిల్ రాష్ట్రస్థాయిలో 900 మార్కులకు 491.5 (75వ ర్యాం క్) సాధించాడు. టీజీపీఎస్సీ గ్రూప్-1 ర్యాంక్‌లు ప్రకటించగా నర్రా అఖిల్ రాష్ట్రస్థాయిలో 75వ ర్యాంక్ సాధించాడు. 75వ ర్యాంకు సాధించిన అఖిల్‌ను ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.
ప్రతిభ చాటిన మూసాపేట విద్యార్థి
పెద్దశంకరంపేట, మార్చి 30: టీ జీపీఎస్‌పీ గ్రూ ప్-1 పరీక్షా ఫలితాల్లో పెద్దశంకరంపేట మండలం మూసాపేట గ్రామానికి చెందిన ఎరగారి ప్రభాత్‌రెడ్డి అనే యువకుడు రాష్ట్ర స్థాయిలో 73వ ర్యాంకు సాధించాడు. గ్రామానికి చెందిన శశింధర్రెడ్డి పావనీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రభాత్‌రెడ్డి రెండు నెలల కిత్రం వెల్లడైన గ్రూప్ -4 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రస్తుతం మెదక్ జిల్లా కొల్చారంలోని రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈసందర్భంగా అతన్ని గ్రామస్తులు, కుటుంబసభ్యులు, బంధువులు అభినందించారు.