వెల్దుర్తి, మే 8. మాసాయిపేట మండల పరిధిలోని హల్దీ ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రాజెక్టులో పడి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం.. ప్రకారం వెల్దుర్తి మండలం చర్లపల్లి పంచాయతీ వర్ధవాని చెరువు తండాకు చెందిన కెతావత్ గోపాల్ (30) గురువారం ఉదయం ప్రాజెక్ట్‌లో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.
గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులతో పాటు వెల్దుర్తి పోలీసులకు సమాచారం అందించారు. వెల్దుర్తి పోలీసులు ప్రాజెక్ట్ వద్దకు చేరుకొని ఈతగాళ్లు, స్థానికుల సహయంతో మృతదేహం కోసం వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించగా ప్రాజెక్ట్ వద్దకు చేరుకొని మృతి దేహం కోసం గాలిస్తున్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.