Narsapur | మాతృ దేవోభవ పితృ దేవోభవ.. నర్సాపూర్లో స్వర్గస్తులైన తల్లిదండ్రులకు గుడి నిర్మిస్తున్న కొడుకు
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక్క పూట భోజనం పెట్టడానికి వెనుకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా వారికి గుడి కట్టించి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ఓ వైద్యుడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట్ గ్రామానికి చెందిన హోమియోపతి వైద్యుడు దండెపు బస్వానందం చనిపోయిన తన తల్లిదండ్రులు దండెపు ఈశ్వరప్ప(1985), పెంటమ్మల(2006)కు అతడి వ్యవసాయ పొలంలోనే గుడిని కట్టించాడు.
- నర్సాపూర్ మండలం రుస్తుంపేట్లో ఏర్పాటు
- ఈ నెల 9న విగ్రహాల ప్రతిష్ఠాపన, గుడిప్రారంభోత్సవం
Narsapur | నర్సాపూర్, మే 6 : జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక్క పూట భోజనం పెట్టడానికి వెనుకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా వారికి గుడి కట్టించి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ఓ వైద్యుడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట్ గ్రామానికి చెందిన హోమియోపతి వైద్యుడు దండెపు బస్వానందం చనిపోయిన తన తల్లిదండ్రులు దండెపు ఈశ్వరప్ప(1985), పెంటమ్మల(2006)కు అతడి వ్యవసాయ పొలంలోనే గుడిని కట్టించాడు. తనకున్న రెండు గుంటల భూమిలో గుడి నిర్మాణం చేపట్టాడు. స్వర్గస్తులైన తల్లిదండ్రుల విగ్రహాలను మార్బుల్ రాయితో తయారుచేయించాడు.
ఈశ్వరప్ప, పెంటమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరిలో రెండవ కొడుకు డాక్టర్ దండెపు బస్వానందం తన తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేసి తనను డాక్టర్ చదివించారని, వ్యవసాయం చేస్తూ కష్టపడిన అదే భూమిలో వారికి గుడి నిర్మాణం చేశానని తెలిపారు. తమ పొలంలో వాగు ఉండేదని, ఆరుగాలం కష్టించి పండించిన పంటలు వరదలొచ్చినప్పుడు కొట్టుకుపోయేవని ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలోని ఊట బావి నుంచి మోట కొట్టి పంటకు సాగునీరు అందించేవారని వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన విగ్రహాల ప్రతిష్ఠాపన, గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని, జన్మనిచ్చి తనను ఇంత వాడిని చేసిన తల్లిదండ్రులకు గుడి కట్టించి వారి రుణం తీర్చుకుంటున్నానని తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

