దుబ్బాక టౌన్, అక్టోబర్ 27: సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందని, రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మవద్దని మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లను అభ్యర్థించారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి గడపను తట్టి ఓటర్లను పలకరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్కు అండగా ఉండాలని అభ్యర్థించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించారు. బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, రాష్ట్ర నాయకుడు రొట్టె రాజమౌళి, సీనియర్ నాయకులు పల్లె రామస్వామిగౌడ్, వడ్లకొండ శ్రీధర్, భూంరెడ్డి, సంజీవరెడ్డి, బట్టు ఎల్లం, శ్రీరాం రవీందర్, రాజు, చాడ భాను, బండిరాజు, కౌన్సిలర్లు ఆస యాదగిరి, ఆస స్వామి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పకుంగా అమలు చేసి తీరుతారని స్పష్టం చేశారు. ప్రతి పక్షనాయకులు మోసపూరిత హామీలతో వస్తున్నారని వారిని నమ్మి ఓటు వేయవద్దని కోరారు. గతంలో ఇవ్వని హామీలను సైతం సీఎం కేసీఆర్ పక్కాగా అమలు చేస్తున్నారని తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనబడుతుందన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే దుబ్బాక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు ఓటర్లకు వివరించారు. గడిచిన మూడేండ్లలో దుబ్బాక అభివృద్ధిలో ఎంతో వెనుకబడ్డామని నేడు ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకొని రెట్టింపు అభివృద్ధిని చేసుకుందామని తెలిపారు. ఉద్యమ గడ్డ అయిన దుబ్బాకలో గులాబీ జెండా ఎగరాలని అందుకు ఓటర్లంతా కారు గుర్తుకు ఓటు వేసి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారంలో పట్టణ శాఖ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ, నాయకులు ఆకుల దేవేందర్, తునికి సురేశ్, ఖలీల్, పర్సకృష్ణ, పడాల నరేశ్, మల్లేశంగౌడ్, పులిగారి ఎల్లం, కొట్టె రాజు, ఎంగారి రాజిరెడ్డి, భూపాల్, రాజశేఖర్, చంద్రమౌళి, దేవుని చంద్రయ్య, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.