జహీరాబాద్ : జహీరాబాద్ ( Zaheerabad ) మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని పాత 23వ వతన్ భాగ్ వార్డుకు చెందిన మాజి కౌన్సిలర్ మేరాజ్ ఉన్నాసా బేగం , కో ఆప్షన్ మెంబర్ , కాంగ్రెస్ నాయకులు అక్బర్, మోయిన్తో పాటు పలువురు మహిళా నాయకులు బీఆర్ఎస్ ( BRS ) సొంత గూటికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు( MLA Manik Rao) , మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్ రావు , డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బలంగా గళమెత్తుతుందని అన్నారు.
జహీరాబాద్ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను మరింత బలోపేతం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజీ పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.