తొగుట, ఫిబ్రవరి 6: మల్లన్నసాగర్ నిర్మా ణం భేష్ అని కర్ణాటక ఎమ్మెల్యేల బృందం పేర్కొంది. మంగళవారం సిద్దిపేట జిల్లా తొ గుట మండలంలోని తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్నసాగర్‌ను కర్ణాటక రాష్ర్టానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు రైతులకు వరం లాంటిదన్నారు. ఎమ్మెల్యేల బృందానికి ప్రా జెక్టు గురించి ఈఎన్సీ హరిరామ్ వివరించా రు. కాశేశ్వరం ఆధారంగా వ్యవసాయం, తాగునీటి వ్యవస్థకు ప్రాజెక్టు నిర్మాణం చేయ డం జరిగిందన్నారు. తక్కువ సమయంలో భూ సేకరణ పూర్తిచేసి ప్రాజెక్ట నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలోఎస్ఈ బస్వరాజ్, ఈఈ సాయిబాబు, వెంటేశ్వర్రావు, డీఈ శ్రీనివాస్, ఇంజినీర్లు పాల్గొన్నారు.
చిన్నకోడూరు, ఫిబ్రవరి 6: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను కర్ణాటక ఎమ్మెల్యేలు మంగళవారం సందర్శించారు. పంప్‌హౌస్ రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్టడీటూర్‌లో భాగంగా 20మంది ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై ఈఎన్సీ హరిరామ్‌ను వివరాలు అడిగి తె లుసుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం అద్భుతం గా ఉందని ఎమ్మెల్యేలు కితాబిచ్చారు. కార్యక్రమంలో ఈఎన్సీ బసవరాజ్, ఏఈలు, జేఈలు ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.