Mallampet | పాపన్నపేట, మార్చి 23 : ఓ బాలుడు ఈతకని వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మల్లంపేటలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు మల్లంపేట గ్రామానికి చెందిన కురుమ దుర్గయ్య అనే 12 సంవత్సరాల బాలుడు శనివారం సాయంత్రం స్థానికంగా ఉన్న రెడ్ల చెరువులోకి ఈతకని వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిమృతి చెందాడు. ఆదివారం ఉదయం శవమై నీటిలో తేలాడు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇది ఇలా ఉండగా మృతుడికి తండ్రి సాయిలు తల్లి మనమ్మతో పాటు చెల్లెలు రక్షిత ఉన్నారు.