చేగుంట, ఆగస్టు 24: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 82మంది క్రీడాకారులు ఎంపికైనట్లు మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం గణేశ్వ్రికుమార్,ప్రధాన కార్యదర్శి మేడ భుజగేందర్రెడ్డి తెలిపారు. శనివారం చేగుంటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన పోటీ ల్లో 183 మంది క్రీడాకారులు పాల్గొనగా వివిధ విభాగాల్లో 82 మంది ఎంపికైనట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయిలో జరిగే యోగా పోటీలకు సంబంధించిన తేదీలు, జరిగే ప్రదేశాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చక్రవర్తి, జిల్లా యోగాసన స్పోర్ట్స్ కోశాధికారి సత్యనారాయణ,సెక్రటరీ నర్సింహులు, జాతీయ నంభర్వన్ రెఫరీ శ్రీదేవి, పీఈటీలు శ్యామ్, అల్లి నరేశ్,కర్ణం మల్లీశ్వరి, ప్రీతి, మమత, బాలరాజ్, ప్రవీణ్, నవీన్, మనోహర్రావు, సంతోష్ పాల్గొన్నారు.