75వ గణతంత్ర వేడుకలు సంబురంగా సాగాయి. శుక్రవారం ఊరూరా..వాడవాడలా త్రివర్ణపతాకం రెపరెపలాడింది. ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టరేట్లు సంబురాలతో కళకళలాడాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించి వందనం చేశారు. పటుచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
జాతీయ జెండాలు చేతబూని పాఠశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఊరూవాడా దేశభక్తిగీతాలు, నినాదాలతో మార్మోగాయి. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.