మెదక్ మున్సిపాలిటీ, మార్చి 5 : బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యా ప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షకు 6,410 మంది విద్యార్థులకు 6,180 మంది విద్యార్థులు హాజరు కాగా, 230 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి మాధ వి తెలిపారు. ఇందులో జనరల్ విభాగంలో 5,780 మంది విద్యార్థులకు 5,575 మంది విద్యార్థులు హాజరు కాగా.. 205 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషన్ విభాగంలో 630 మంది విద్యార్థులకు 605 మంది విద్యార్థులు హాజరు కాగా.. 25 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు 45 నిమిషాల ముందు నుంచే అనుమతించినట్లు వివరించారు. జిల్లాలో ఎక్కడ డిబార్కు కానీ, మాల్ప్రాక్టిస్కు పాల్పడలేదని పరీక్షలు ప్రశాంతంగా జరిగయన్నారు. జిల్లా వ్యాప్తంగా 96.41 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, కేవలం 4 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరుకాలేదన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌ లిక వసతులు కల్పించడంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్లలోపు గల జిరాక్స్ కేంద్రాలను మూసివేశారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, టీజీఆర్ఎస్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల పనితీరు, తాగునీటి వసతి తదితర వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత దృష్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఇంటల్ నోడల్ అధికారి మాధవి, అధికారులు ఉన్నారు.