హుస్నాబాద్, సెప్టెంబర్ 23: హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.60కోట్లు మంజూరు చేశామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. మడద-హుస్నాబాద్ బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు రూ.1.70కోట్లు, నాగారం-ఉమ్మాపూర్-మహ్మదాపూర్ రోడ్డుకు రూ.2.77 కోట్లు, తోటపల్లి నుం చి పూసర్లపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.2.57 కోట్లు, పందిల్ల-పరివేద రోడ్డుకు రూ.2.07 కోట్లు, పందిల్ల-అంబయ్యపల్లి, గొల్లపల్లి-బంజేరుపల్లి వరకు రూ.2.47 కోట్లు, కోహెడ మండలంలోని బస్వాపూర్-కోహెడ వయా ధర్మసాగర్పల్లి రోడ్డు కు రూ.2.81కోట్లు, నారాయణపూర్-శ్రీరాముపల్లి రెన్యువల్ పనులకు రూ.52.10లక్షలు మం జూరైనట్లు మంత్రి తెలిపారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో రాములపల్లి-ఎల్లంపల్లి క్రాస్‌రోడ్డు వరకు రూ.88లక్షలు, గణపూర్ నుంచి ఆకునూరు వరకు రూ.23.07లక్షలు, అమ్మనగుర్తి నుంచి వంగర క్రాస్‌రోడ్డు వయా గుండ్లపల్లి రోడ్డుకు రూ.3.17 కోట్లు వచ్చాయన్నారు. చిగురుమామిడి మం డలం ఆర్అండ్బీ రోడ్డు నుంచి ముదిమాణిక్యం వరకు రూ.1.22కోట్లు, గాగిరెడ్డిపల్లి-లంబాడిపల్లి వయా బరిగెలపల్లి రోడ్డుకు రూ.28లక్షలు, సుందరగిరి క్రాస్‌రోడ్డు నుంచి ఉల్లంపల్లి, మడత వరకు రూ.10లక్షలు, చిగురుమామిడి నుంచి రేకొండ వరకు రూ.1.97కోట్లు వచ్చాయన్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మల్లా రం క్రాస్ నుంచి పీడ బ్ల్యూ రోడ్డు వరకు రూ.86లక్షలు, హవర్దార్పల్లి నుంచి ఎర్రబెల్లి వరకు రూ.37లక్షలు, ముత్తారం నుంచి గట్లనర్సింగాపూర్ క్రాస్‌రోడ్డు వరకు రూ. 3.74 కోట్లు, కొప్పూరు నుంచి కొత్తపల్లి రోడ్డు వర కు రూ.1.17కోట్లు, ఎత్కుతుర్తి మండలంలోని దామెర నుంచి కొత్తపల్లి రోడ్డుకు రూ. 3.47కోట్లు, దామెర నుంచి జడ్పీ రోడ్డు వరకు రూ.87లక్షలు, దండెపల్లి నుంచి దేశరాజ్‌పల్లి వరకు రూ.1.02 కోట్ల వచ్చినట్లు పేర్కొన్నారు.
కోహెడ మండలం గోట్లమిట్ట-నారాయణపూర్ మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.91.55 లక్షలు, కోహెడ-మైసంపల్లికి రూ.57లక్షలు, చిగురుమామిడి మండలం పీచుపల్లి రోడ్డులో రూ.57లక్షలు, లంబాడిపల్లి-పీచుపల్లి మధ్య రూ.77లక్షలు, సైదాపూర్ మండలం పెర్కపల్లి-దుద్దెనపల్లి మధ్య రూ.3.47 కోట్లు, పెర్కపల్లి-సైదాపూర్ మధ్య రూ.3.47 కోట్లు, ఆకునూరు-గణపూర్ మధ్య రూ.57 లక్షలు. భీమదేవరపల్లి మండలం ఎర్రగడ్డ-వంగర గ్రామం వద్ద రూ.87 లక్షలు, ఎల్కతుర్తి మండలం జడ్పీ రోడ్డునుంచి బావుపేట మధ్య కాజ్‌వేకు రూ.32లక్షలు, జడ్పీ రోడ్డు నుంచి బావుపేట వైకుంఠధామం మధ్య కల్వర్టు నిర్మాణానికి రూ.52లక్షలు మంజూరైనట్లు మంత్రి పొన్నం వివరించారు.