కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవు
వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుందట. 10 హెచ్‌పీ మోటర్లతో నీళ్లు తోడేయవచ్చని రైతులకు సమస్యలు సృష్టించాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు.
- వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుందట!
- అభివృద్ధి సాధిస్తున్న బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలి
- కాంగ్రెస్, బీజేపీల మాయమాటలు నమ్మొద్దు
- హ్యాట్రిక్ కొట్టనున్న బీఆర్ఎస్
- నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి
హత్నూర, నవంబర్ 28: వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుందట. 10 హెచ్‌పీ మోటర్లతో నీళ్లు తోడేయవచ్చని రైతులకు సమస్యలు సృష్టించాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హత్నూర మండలం బోర్పట్ల, రెడ్డిఖానాపూర్, కాసాల, ముచ్చర్ల, తాహెర్కాన్పేట, నస్తీపూర్, హత్నూర గ్రామాల్లో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్‌బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. అలాంటి పార్టీలపై అప్రమత్తంగా ఉండి, అభివృద్ధి సాధిస్తున్న పార్టీకి పట్టం కట్టాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగాఅమలు చేస్తున్నారన్నారు.
అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబంధు డబ్బులను కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకుని రైతులకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడు అభివృద్ధిని సాధించలేదన్నారు. సంక్షేమ పథకాలను పట్టించుకోదన్నారు. గతంలో వ్యవసాయానికి ప్రభుత్వ సాయం లేక, ఉద్యోగ అవకాశాలు కల్పించక ప్రజలు వలస వెళ్లిన రోజుల నుంచి నేడు ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వచ్చేలా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసుకునేలా కృషి చేస్తున్న బీఆర్ఎస్కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించనున్నదన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు..

సునీతమ్మ ప్రచారానికి బ్రహ్మరథం
హత్నూర మండలంలో సునీతాలక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారానికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామగ్రామాన వెంటనడిచి ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటామని ముక్తకంఠంతో తెలిపారు. సీఎం కేసీఆర్ మాకు అన్నివిధాలుగా అండగా నిలిచారని, ఆయన సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయలు, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దేవేందర్‌రెడ్డి, దుర్గారెడ్డి, బుచ్చిరెడ్డి, ఎల్చాల మధు, కిషన్‌రావు, వెంకటేశంగుప్తా, రాణి రాంచెంద్రారెడ్డి, వీరస్వామిగౌడ్, కిష్టయ్య, రవి, శివశంకర్‌రావు, యాదగిరి, ఎల్లయ్య, విఠల్‌రెడ్డి, అజ్జు, సాయి, అజీస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

