చేర్యాల, జూన్ 22 : గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహీత జిల్లాగా సిద్దిపేటను తయారు చేసేందుకు అన్నివర్గాలు పోలీసులకు సహకరి ంచా లని సీఐ శ్రీను కోరారు.యాంటీ డ్రగ్స్ అవగాహన వీక్ సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో సీఐ శ్రీను, ఎస్సై నిరేశ్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు.సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి చేర్యాల పోలీస్ స్టేషన్ వరకు 2కే రన్‌తో పాటు మానవహారం నిరించారు.
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని యువకులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశా రు.అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని విద్యా సంస్థల యాజమా న్యాలను కోరారు.విద్యార్థులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు గమనిం చాలని, కొందరు చెడు మార్గాల వైపు ఆకర్షితు లవుతున్నారన్నారు.
మత్తుకు అలవాటు పడి గంజాయి సేవించి జీవితాలు నాశనం చేసుకుం టున్నట్లు తెలిపారు.మత్తు పదార్థాలు సేవిస్తున్న వారి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాలు, పట్టణాల్లో మాదకద్రవ్యాల విషయాల్లో అన్నివర్గాలు కఠినంగా వ్యవహరిం చాలని, యువతను వాటికి దూరంగా ఉంచాలని డ్రగ్స్ రహిత జిల్లాగా సిద్దిపేటను తయారు చేయా లని కోరారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్ నర్సింహాచారి, సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.