మెదక్, మే 12 (నమస్తే తెలంగాణ) : మెదక్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మెదక్ పార్లమెంట్లో పురుషుల కంటే మహి ళ ఓటర్లే అధికంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 18,28,210 మంది ఓటర్లు ఉన్నా రు.
9,25,891 మంది మహిళా ఓటర్లు ఉండగా, 8,92,656 మంది పురుషుల ఓట ర్లు ఉన్నారు. ఇతరులు 209 మంది ఉన్నారు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి 44 మం ది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఒక్కో పోలింగ్ కేం ద్రానికి 3 ఈవీఎంలు, ఒక వీవీ పాట్, ఒక కంట్రోల్ యూనిట్‌ను అధికారులు తరలించారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ సెగ్మెంట్లో 277 పోలింగ్ కేంద్రాలు, నర్సాపూర్‌లో 307, సిద్దిపేటలో 273, దుబ్బాకలో 253, గజ్వేల్‌లో 322, సంగారెడ్డిలో 281, పటాన్చెరు లో 411 మొత్తం 2124 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎన్నికల నిర్వహణ కోసం 2336 మంది పీవోలు, 2336 మంది ఏపీవోలు, 4672 వోపీవోలు, 166 మంది మైక్రో అబ్జర్వర్లు, 214 మంది సెక్టార్ ఆఫీసర్లు, 2124 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 7,96 1 బ్యాలెట్ యూనిట్లు, 2,652 కంట్రో ల్ యూనిట్లు, 2,970 వీవీ ప్యాట్లు ఉన్నాయి.
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వీల్చైర్లు, ర్యాంపులు నిర్మించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు బిగించారు. టాయిలెట్స్ సిద్ధం చేయడంతో పాటు తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పా ట్లు చేశారు. ఆశ వర్కర్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. యువ, దివ్యాంగ, మహి ళా మోడల్ పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు.