పేదల జీవితాల్లో.. నూతన కాంతులు
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి పల్లెలు, పట్టణాల్లో విశేష స్పందన లభిస్తున్నది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. వైద్యులు దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేసి, అక్కడికక్కడే మందులు, అద్దాలు అందజేస్తున్నారు.
- పల్లెలు, పట్టణాల్లో శిబిరాలకు ప్రజలు క్యూ
- 85వ రోజు మెదక్ జిల్లాలో 2879 మందికి పరీక్షలు
- 215 మందికి కండ్లద్దాలు పంపిణీ
- సంగారెడ్డిలో 9112 మందికి టెస్ట్‌లు
- 561 మందికి అద్దాలు అందజేత
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి పల్లెలు, పట్టణాల్లో విశేష స్పందన లభిస్తున్నది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. వైద్యులు దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేసి, అక్కడికక్కడే మందులు, అద్దాలు అందజేస్తున్నారు. 85వ రోజు మెదక్ జిల్లాలో 21 బృందాలు 2879 మందికి కంటి పరీక్షలు నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లాలో 9112 మందికి టెస్ట్‌లు చేసి, 561 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 400 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఆర్డర్ చేశారు. 763 మందికి కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా సూచించారు. – మెదక్
సంగారెడ్డి న్యూస్‌నెట్‌వర్క్, మే 26
మెదక్, మే 26 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,38,947 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 2,08,847 మంది, మహిళలు 2,30,100 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 40,424 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 40 వేల మందికి అద్దాల కోసం ఆర్డరిచ్చారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 85వ రోజు 21 బృందాలు 2879 మందికి కంటి పరీక్షలు చేశాయి.
9112 మందికి కంటి పరీక్షలు
సంగారెడ్డి, మే 26 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాల్లో 9112 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 4410 పురుషులు, 4702 మంది మహిళలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. గ్రామాల్లోని 7538, పట్టణాల్లోని 1203, జీహెచ్ఎంసీలో 371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు చేసిన వారిలో 269 మంది పురుషులు, 292 మంది మహిళలకు కళ్ల అద్దాలు అందజేశారు. 400 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు ఆర్డర్ చేశారు. 763 మందికి కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

