English Channel | ఇంగ్లిష్ ఛానెల్లో బోటుకు అగ్నిప్రమాదం.. 157 మంది వలసదారుల్ని రక్షించిన రెస్క్యూ టీంలు
English Channel : వివిధ దేశాలకు చెందిన వలసదారులు అక్రమంగా యూరప్ దేశాలకు వలసవెళ్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్లకు ఇంగ్లిష్ ఛానెల్ ద్వారా నిత్యం వేలాదిగా తరలివెళ్తుంటారు. వీరిలో కొందరు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతుంటారు.
English Channel : వివిధ దేశాలకు చెందిన వలసదారులు అక్రమంగా యూరప్ దేశాలకు వలసవెళ్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్లకు ఇంగ్లిష్ ఛానెల్ ద్వారా నిత్యం వేలాదిగా తరలివెళ్తుంటారు. వీరిలో కొందరు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. ఎందుకంటే ఇది అక్రమ మార్గం. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే, సరైన ప్రమాణాలు పాటించని బోట్లు, నాటు పడవల్లో వెళ్తుంటారు. దీంతో కొన్నిసార్లు అవి ప్రమాదాలకు గురై.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటారు.
తాజాగా ఇంగ్లిష్ ఛానెల్లో ఇలాంటి ఒక ఘటన జరిగింది. వలసదారులతో ఫ్రాన్స్ నుంచి బ్రిటన్ వెళ్తున్న ఒక బోటు, మంగళవారం వేకువఝామున అగ్నిప్రమాదానికి గురైంది. కెనడా, బ్రిటిష్ కొలంబియా, వెర్నాన్ పరిధిలోని నదిపై బోటులో వెళ్తుండగా అది ఉన్నట్లుండి అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో బోటులోని సిబ్బంది రెస్క్యూ టీంలకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఆలోపే బోటు చాలా వరకు అగ్నిప్రమాదానికి గురైంది. అయినప్పటికీ రెస్క్యూ టీంలు శ్రమించి, దాదాపు 157 మంది వలసదారుల్ని రక్షించారు. ఈ ఘటనలో ఇతర బాధితులకు సంబంధించిన వివరాలేమీ తెలియలేదు. బ్రిటన్‌తోపాటు ఫ్రాన్స్‌కు చెందిన సిబ్బంది కూడా కొందరిని రక్షించారు. బౌలోగ్నే-సుర్-మెర్ సరిహద్దు వద్ద నౌకల్ని రక్షించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
ఇంగ్లిష్ ఛానెల్ అత్యంత ప్రమాదకరమైన మార్గం. అక్రమంగా సరిహద్దులు దాటేందుకు వలసదారులు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. నౌకలు, పడవల్లో ఈ జలమార్గంలో వెళ్తూ యూరప్‌కు వలస వెళ్తుంటారు. కొన్నిసార్లు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. 2018-2025 మధ్య 168 మంది వలసదారులు ఈ మార్గంలో ప్రాణాలు కోల్పోయారు. బోటు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- boat
- Britain
- English Channel
- France
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

