త్రివర్ణ శోభితం

వాడవాడలా జాతీయ జెండా రెపరెపలు
మెదక్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జెండావిష్కరణ
గణతంత్ర దినోత్సవాన్ని మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఘనంగా జరుపుకొన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, రాజకీయ పార్టీల ఆఫీసుల్లో మంగళవారం 72వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అధికారులు, మెదక్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ చందన దీప్తి, జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ జెండాలను ఎగురవేశారు. అనంతరం సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, మెదక్‌లో అదనపు కలెక్టర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందజేసిన పలువురిని సత్కరించి, అవార్డులను అందజేశారు.
- నమస్తే తెలంగాణ, నెట్వర్క్
తాజావార్తలు
- పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్‌రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా