పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

- ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
హవేళిఘనపూర్ (జనవరి 3) : సీఎం కేసీఆర్ పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టారని, సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం అని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కూచన్‌పల్లి శివారులోని ఎమ్మెల్సీ వ్యవసాయ క్షేత్రంలో మెదక్ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన 30 మందికి మంజూరైన రూ.21, 81,235 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు మంజూ రు చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో హవేళిఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ బయ్యన్న, మాజీ సర్పంచ్ కిరణ్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్, ఫూల్సింగ్, రమేశ్, గణపతి తదితరులు పాల్గొన్నారు.