పెంపకందారులకు భరోసా

- నేటి నుంచి నట్టల నివారణ మందు పంపిణీ
- మెదక్ జిల్లాలో 8లక్షలకు పైగా పశువులు, జీవాలు
- ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ.. 50 బృందాలు ఏర్పాటు
- పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు
మెదక్ రూరల్ : పశువులు, మేకలు, గొర్రెల్లో నట్టల నివారణతో పాటు వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచడమే లక్ష్యంగా నేటి నుంచి ఈనెల 7వ తేదీ వరకు జిల్లాలోప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా నట్టల నివారణ మందు వేయనున్నారు. ప్రభుత్వం పశు సంపద పెంపునకు ప్రత్యేక కృషిచేస్తున్నది. పాడి పశువులు, జీవాలు పెంచేందుకు ప్రత్యేక పోత్సాహకాలు, రాయితీలు అందిస్తున్నది. జీవాల సంరక్షణ, సీజనల్ వ్యాధు లు రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్లను సైతం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. దీంతో పశు, జీవాల పోషకులు పెంపకంపై ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నట్టల నివారణ, గాలికుంటు నివారణ టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో జిల్లాలోని పశు, జీవాల పెంపకందారులకు మేలు చేకూరుతున్నది. మెదక్ జిల్లాలో 8,14,624 పశువులు, జీవాలు ఉన్నాయి. వీటిలో పశువులు 1,89,975, జీవాలు 6,24,649 ఉన్నాయి
టీకాలకు నిధులు..
పశువులు, గొర్రెలు, మేకల్లో నట్టలు, గాలికుంటు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు వెచ్చిస్తున్నాయి. నట్టల నివారణ వ్యాక్సిన్ ఒక పశువుకు రూ. 10, గొర్రెలకు, మేకలకు రూ.5 చొప్పున ఖర్చు చేస్తున్నది. నట్టల నివారణ మందు కోసం ఒక్కో పశువుకు రూ.12, గొర్రెలు, మేకలకు రూ.2.10 చొప్పున వ్యయం
చూడి పశువులకూ...
గొర్రెలు, మేకలకే పరిమితమైన నట్టల నివారణ మందును పెద్ద పశువులకు కూడా వేయనున్నారు. ముఖ్యంగా 10 రోజుల నుంచి సుమారు 4 నెలల వయసున్న పశువులకు నట్టల నివారణ మందు వేస్తారు. ఇక నుంచి పెద్ద పశువులతో పాటు చూడి పశువులకు సైతం నట్టల నివారణ మందు వేయనున్నారు. ఈనెల 1నుంచి 7వరకు నట్టల నివారణ మందు, ఈనెల 25నుంచి 30 వరకు పశువులకు నట్టల నివారణ మాత్రలు వేయనున్నారు.
15 నుంచి గాలికుంటు టీకాలు...
డిసెంబర్ 15 నుంచి జనవరి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు గాలికుంటు నిరోధక టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు గాలికుంటు నివారణ మందును పాడి పశువులతో పాటు గొర్రెలు, మేకలకు వేయనున్నారు.
వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి
పశు, జీవాల పెంపకందారులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలి. వ్యాక్సిన్ వేయిస్తే గొర్రెలు, మేకల్లో నట్టల నిర్మూలనతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈనెల 1 నుంచి 7వరకు జిల్లాలో క్యాంపులు నిర్వహించి నట్టల నివారణ టీకాలు వేస్తాం. జిల్లాలో 50 బృందాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా టీకాలను సరఫరా చేస్తున్నది. ఈ అవకాశాన్ని పాడి రైతులు, జీవాల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలి.
- వెంకటయ్య, జిల్లా పశు సంవర్ధ్దక శాఖ అధికారి, మెదక్
తాజావార్తలు
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
- సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
- సైకిల్‌పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్‌లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
- కూతుళ్ల హత్య కేసు.. తల్లికి వదలని క్షుద్రపిచ్చి..
- మన చరిత్ర సుధీర్ఘమైనది.. భారత్‌కు సందేశంలో ఆస్ట్రేలియా ప్రధాని