ముంబైలో రూ.1.18 కోట్ల విలువైన చరాస్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ | దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని బాంద్రాలో రూ.1.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 75 ఏళ్ల మహిళ సహ.. మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని బాంద్రాలో రూ.1.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 75 ఏళ్ల మహిళ సహ.. మరో వ్యక్తిని అరెస్టు చేశారు. సదరు మహిళను జోహ్రబాయ్ షేక్‌గా గుర్తించారు. మాదకద్రవ్యాలను విక్రయించేందుకు ఓ వ్యక్తి శనివారం బాంద్రాలోని వాటర్ ఫీల్డ్ రోడ్‌కు వచ్చే అవకాశం ఉందని క్రైమ్ బ్రాంచ్‌కు నిర్ధిష్ట సమాచారం అందిందని, ఈ మేరకు కిశోర్ గావ్లి (57) అనే వ్యక్తిని వలవేసి పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. జోహ్రబాయ్ షేక్ తనకు విక్రయించిందని తెలిపారు. దీంతో పోలీసులు బాంద్రాలోని ఆమె నివాసం దాడులు చేసి మూడు కిలోల చరాస్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు చాలా రోజులుగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారిపై నార్కోటిక్ డ్రగ్, సైకోట్రోపిక్ పదార్థాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
బర్త్‌డే వేడుకల్లో కాల్పులు.. ఇద్దరు మృతి
1 నుంచి పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్!
24-05-2021 సోమవారం.. మీ రాశి ఫలాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

