సోమవారం 03 ఆగస్టు 2020
Medak - Jun 22, 2020 , 01:00:05

జిల్లాలో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

జిల్లాలో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • యోగా విశిష్టతను తెలియజేసిన గురువులు
  • యోగాసనాలు వేసిన పలువురు 

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌ : ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువులు వివిధ రకాలు ఆసనాలు చేయించారు. పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, అందోల్‌లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ యోగాసనాలు చేశారు. సిద్దిపేట కోమటిచెరువుపై నిరాడంబరంగా యోగా దినోత్సవం నిర్వహించారు. సంగారెడ్డి జైలులో సూపరింటెండెంట్‌ నవాబ్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించుకున్నారు. 220 మంది ఖైదీలు, జైలు సిబ్బంది పాల్గొని యోగాసనాలు చేశారు.  


logo