వెల్దుర్తి, ఆగస్టు 25 : మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో కుక్క 20మందిని గాయపర్చింది. సోమవారం మాసాయిపేట గ్రామ పంచాయతీ నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రోడ్డు వెంట అంగడి జరుగుతుండగా, గ్రామంలోని ఓ కుక్క ఒక్కసారిగా అంగడికి వచ్చిన వారిపై దాడిచేసి, 20 మందిని గాయపర్చి పరుగెత్తింది.
దీంతో గ్రామస్తులు, అంగడికి వచ్చిన దుకాణాదారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, గ్రామానికి వచ్చి 108 అంబులెన్స్‌లు కొంతమంది బాధితులను మెదక్, మరికొంత మందిని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.