జహీరాబాద్, ఏప్రిల్ 22: ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు దండులా తరలి వెళ్దామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం జహీరాబాద్‌లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 ఏండ్ల పాటు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారని, సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభు త్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలు, హామీలకు కాంగ్రెస్ సర్కారు తిలోదకాలు ఇచ్చిందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు విమర్శించారు. సమావేశంలో జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్ మండలాల పార్టీ అధ్యక్షులు నారాయణ, సంజీవ్‌రెడ్డి, నర్సింలు, పీఎసీఎస్ చైర్మన్ మచ్చేందర్, నాయకులు గుండప్ప, విజయ్‌కుమార్, హీరురాథోడ్, అమీత్‌కుమార్, వహీద్, చిన్నరెడ్డి, రాములు, బస్వరాజ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నకోడూరు, ఏప్రిల్ 22: అనేక హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత విస్మరించిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ విమర్శించారు. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ దారి ఖర్చులకు మంగళవారం చిన్నకోడూరులోని శ్రీనివాస్ రైస్‌మిల్ ఇండస్ట్రిలో బీఆర్ఎస్ నాయకులు కూలి పనిచేశారు. రైస్‌మిల్లులోని బియ్యం సంచులను ట్రాక్టర్లలో లోడింగ్ చేశారు. దీనికి శ్రీనివాస ఇండస్ట్రీస్ యాజమాన్యం రూ.10 వేలు, సివిల్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి రూ.10 వేల అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సభకు చిన్నకోడూరు మండలం నుంచి భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, నాయకులు తరలివెళ్తామని తెలిపారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాపయ్య, కనకరాజు, కాముని ఉమేశ్‌చంద్ర, ఇట్టబోయిన శ్రీనివాస్, కొండం రవీందర్ రెడ్డి, ఎల్లయ్య, వెంకటేశం, అబ్బిరెడ్డి, సుంచు రమేశ్, మిట్టపల్లి గణేశ్, గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి, చెట్టుపల్లి భానుచందర్, మన్నె ఆనంద్, పలువురు పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 22: ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్‌పోస్టర్లను స్థానిక బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు బర్మ రాజమల్లయ్య మాట్లాడుతూ.. ఈనెల 27న వరంగల్‌లో తలపెట్టిన రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మాజీ మండల అధ్యక్షుడు ఇమ్మడి సంజీవరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కర్ర అరుణ, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దాసరి పురుషోత్తం, పీఏసీఎస్ డైరెక్టర్ దేవదాసు తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ చేపట్టిన రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాజీ ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి కోరారు. మంగళవారం కూటిగల్‌లో బీఆర్ఎస్ నాయకులు రజతోత్సవ సభ వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు గూళ్ల ఆనందం, నందనబోయిన నర్సింహులు, మాజీ సర్పంచ్ దోమ బాలమణిబాలకృష్ణ, శ్రీరాముల సత్తయ్య పాల్గొన్నారు.
బెజ్జంకి, ఏప్రిల్ 22: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు బిగుళ్ల మోహన్ ప్రకటనలో కోరారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ కోసం యూత్ సభ్యులు భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.
రామచంద్రాపురం, ఏప్రిల్ 22: కాంగ్రెస్ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లకు సంబంధించి ఆర్సీపురం లక్ష్మీగార్డెన్స్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టి కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. ఉచిత బస్సు తప్పా మిగతా హామీలు అమలు కావడం లేదన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండేవారని గుర్తుచేశారు. అన్నివర్గాలకు కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారని, మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తన స్వలాభం కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లారని, అయినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఉన్నారని తెలిపారు. 27న చలో వరంగల్‌కు పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు దండులా కదలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కార్పొరేటర్ సింధూ తదితరులు మాట్లాడారు. అనంతరం వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నేతలు అంజయ్య, సోమిరెడ్డి, రాములుగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, కుమార్‌గౌడ్, పరమేశ్, దేవేందర్‌యాదవ్, బుచ్చిరెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, బాబ్జీ, ఉమేశ్, శ్రీశైలం, శ్రీధర్‌చారి, వెంకట్రామ్రెడ్డి, కాల్వగడ్డ రాజ్‌కుమార్, మైపాల్యాదవ్, పృధ్వి, నర్సింహ, కృష్ణకాంత్, సత్యనారాయణ, దేవేంద్రాచారి, అజీముద్దీన్, కుత్బుద్దీన్, శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.