కోహీర్, డిసెంబర్ 20: కోహీర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించడంపై సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కోహీర్ పట్టణ వాసుల కల నెరవేరనున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 15,075 జనాభా ఉంది. ప్రస్తుతం 21వేల వరకు పెరిగింది.
ఇండ్లు 3,082 ఉన్నాయి. పట్టణంలో 18వార్డులు ఉన్నాయి. నాలుగు ఎంపీటీసీ స్థానాలకు 8,869 మంది ఓటర్లు ఉన్నారు. అక్షరాస్యత 70.96శాతం ఉంది. కోహీర్ పట్టణం ఇంత వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు విన్నపం మేరకు కోహీర్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని 2022లో అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మాజీ సర్పంచులు, మాజీ ఎం పీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు కూడా హరీశ్‌రావును కలిసి వేడుకున్నారు.
ఇందుకు సానుకూలం గా స్పందించారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో అమలు కాలేదు. గత సర్పం చ్ అతియాజావిద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ప్రతులను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. మాజీ ఎంపీటీసీ అబిదాతలాత్ మరోసారి సీఎంకు లేఖను సమర్పించారు. దీంతో గతంలో బీఆర్ఎస్ అనుకూలంగా ఉండడంతో ఇప్పటి ప్రభు త్వం మున్సిపాలిటీని చేసేందుకు అంగీకరించింది. తద్వారా ప్రభుత్వం నుంచి నిధులు పుష్కలంగా లభించనున్నాయి. పన్నుల వసూలు అభివృద్ధికి దోహద పడనున్నదని ప్రజాప్రతినిధులు అభిప్రా య పడుతున్నారు.
జనాభా అధికంగా ఉండడంతో 1952 నుంచి 1967 వరకు కోహీర్ పట్టణం మున్సిపాలిటీగానే ఉంది. గడ్డమీది లింగారెడ్డి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంత రం పలు కారణాలతో ప్రజలు వలస వెళ్లారు. సం గారెడ్డి, హైదరాబాద్, జహీరాబాద్ పట్టణానికి భారీ సంఖ్యలో వెళ్లారు. దీంతో 1968 నుంచి మేజర్ గ్రామ పంచాయతీగా మార్పు చెందింది. చివరి సారిగా షఫీయొద్దీన్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఐదేండ్ల పాటు చైర్మన్‌గా ఉన్న ఆయన 22 ఏండ్ల పాటు సర్పంచ్‌గా విధులు నిర్వహించారు. ఇది ఓ రికార్డు అని చెప్పవచ్చు. అనంతరం మగ్దుం, అబిదాతలాత్, షేక్ మోహీయొద్దీన్, ఉదయ్‌కుమార్, అర్షియాకలీం, అతియా జావిద్ సర్పంచులుగా సేవలందించారు.
కోహీర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో శుక్రవారం కోహీర్‌లోని పలు పార్టీల నాయకులు సంబురాలు నిర్వహించారు. మున్సిపాలిటీ కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికీ వారు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, స్థానికులున్నారు.
1967 వరకు కోహీర్ ము న్సిపాలిటీగానే ఉంది. వ్యా పారాల కోసం, ఉద్యోగాలు రావడం, ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవడంతో చాలామంది ఇతర గ్రామాలకు వలస పోయా రు. అప్పటి నుంచి మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పడింది. మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.
– రాచూరి కనకరత్నం, కోహీర్
కోహీర్ గ్రామ పంచాయతీని మున్నిపాలిటీగా ఏ ర్పాటు చేస్తే నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉం టుంది. ప్రజలకు అన్ని సౌ కర్యాలు సమకూరుతాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆ దేశాలను పాటిస్తాం. జీవోలు, పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఈనెల చివరి నాటికి అన్ని విషయాలు తెలుస్తాయి.
– భారతి, కోహీర్ మండల అభివృద్ధి అధికారి