నిజాంపేట,ఫిబ్రవరి15: నిజాంపేట డిప్యూటీ తహసీల్దార్‌గా రమ్యశ్రీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ సంబంధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
రమ్యశ్రీ గతంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించారు. తాజాగా పదోన్నతితో డిప్యూటీ తహశీల్దార్‌గా బదిలీ అయ్యారు.