గురువారం 28 జనవరి 2021
Mancherial - Dec 01, 2020 , 04:09:08

ముగిసిన ఇంటర్‌ అడ్మిషన్లు

ముగిసిన ఇంటర్‌ అడ్మిషన్లు

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మంచిర్యాల జిల్లాలో ఇం టర్మీడియెట్‌ ప్రవేశాల గడువు సోమవారంతో ముగిసింది. 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో జిల్లాలో ని ప్రభుత్వ, ప్రైవేట్‌, మోడల్‌, కేజీబీవీ, సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలల్లో రెగ్యులర్‌కు 5451 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. కాగా, వొకేషనల్‌ కోర్సులకు 1109 మంది అడ్మిషన్లు పొందారు. మొదటి సంవత్సరంలో ఈ ఏడాది 6560 మంది చేరిన ట్లు అధికారులు తెలిపారు. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో రెగ్యులర్‌ కోర్సులకు 14 62 మంది అడ్మిషన్‌ తీసుకోగా, వొకేషనల్‌ కోర్సులో 672 మంది చేరారు. సోషల్‌ వెల్ఫేర్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో రెగ్యులర్‌ కోర్సులకు 1599 మంది, వొకేషనల్‌ కోర్సులకు 198 మంది విద్యార్థులు చేశారు. ఇక ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో రెగ్యులర్‌ కోర్సుల్లో 2312 మంది,  వొకేషనల్‌ కో ర్సుల్లో 239 మంది చేరారు. ఇక అడ్మిషన్ల ప్రక్రి య ముగిసిందని అధికారులు వెల్లడించారు.


logo