Prabhas In Mirai | తేజ సజ్జ హీరోగా నటించిన ‘మిరాయ్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హన్మాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ అలాంటి జానర్లో తేజ సజ్జ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే ఈ సినిమా నేడు ముందుకు పాజిటివ్ టాక్ అందుకోగా.. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించారనే వార్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రభాస్ కవచంతో, మెరిసే ఆయుధాలతో ఒక రాజు గెటప్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది నెటిజన్లు క్రియేట్ చేసి పెట్టారని తెలుస్తుంది. నిజంగా మూవీలో ప్రభాస్ లేడని.. కేవలం అతడి వాయిస్ ఓవర్ మాత్రమే వినిపిస్తుందని అభిమానులు చెబుతున్నారు.
ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించారు. రితిక నాయక్ కథానాయికగా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.
#Miraireview : #Mirai >>> #HanuMan
It will create a real havoc at the box-office. It is a mind-blowing visual treat, exemplary storytelling.
And #Prabhas at last. 🙆🏻🥳
The theaters have gone mad at the scene. #BGM is earth shattering. 💥💥💥 pic.twitter.com/Ljq5t80AiK
— Cinema Kahani (@cinemakahani) September 11, 2025
Prabhas’s eyes are enough to conquer theatres 💥💥
Starting scene in #mirai#Prabhas #MiraiOnSep12Th #Miraireview #MiraiMovie pic.twitter.com/w2UdtO821n— its cinema (@itsciiinema) September 11, 2025