Suriya Singam-4 | తమిళ హీరో సూర్యకు కోలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో సూర్య తెలుగులో అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
తమిళ స్టార్ హీరో ఇటీవల సూరారై పోట్రు..తెలుగులో ( ఆకాశం నీ హద్దురా ) సినిమాతో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాండిరాజ్, టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో పలు సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.