Suriya Singam-4 | తమిళ హీరో సూర్యకు కోలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో సూర్య తెలుగులో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ‘గజిని’, ‘ఆరు’, ‘సింగం’ సిరీస్, ‘7th సెన్స్’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘సింగం’ సిరీస్‌తో సూర్య మాస్ ఆడియోన్స్‌కు దగ్గరయ్యాడు. హరి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కోలీవుడ్‌కు సమానంగా తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఈ సిరీస్‌లో తెరకెక్కిన యముడు, సింగం-2, సింగం-3 సినిమాలతో సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో నాలుగో పార్ట్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.
హరి-సూర్య కలిసి ‘సింగం-4’కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ హరి పార్ట్-4కు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే సూర్యకు కథ నెరేట్ చేయనున్నట్లు టాక్. అయితే సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈయన ‘అచలుడు’, ‘సూర్య 42’ చిత్రాలను చేస్తున్నాడు. ఈ రెండు పూర్తయ్యే సరికి కనీసం సంవత్సరం పడుతుంది. అంటే 2023 అంతా ఈ రెండు చిత్రాలతోనే బిజీగా గడుపుతాడు. ఆ తర్వాతే సింగం-4 పట్టాలెక్కే చాన్స్ ఉంది. ఇక డైరెక్టర్ హరీ ఇటీవలే తెరకెక్కించిన ఏనుగు రిలీజై మంచి విజయం సాధించింది. అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్టయింది.