గురువారం 24 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 13, 2020 , 01:54:04

కార్మికుల సంక్షేమానికి పెద్దపీట

కార్మికుల సంక్షేమానికి పెద్దపీట

  • n సింగరేణి డైరెక్టర్‌ ఫైనాన్స్‌ బలరాం
  • n బెల్లంపల్లి, మందమర్రి    ఏరియాలో పర్యటన
  • n ఉద్యోగులు అధైర్య పడద్దు 

రెబ్బెన : కార్మికుల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం పెద్దపీట వేస్తున్నదని సింగరేణి డైరెక్టర్‌ ఫైనాన్స్‌ బలరాం పేర్కొన్నారు. బుధవారం బెల్లంపల్లి ఏరియాలోని కైర్‌గూడ ఓసీపీని సందర్శించి, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగులు కరోనాపై జా గ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవాలన్నారు. గోలేటిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటా రు. అనంతరం బలరాంను ఏరియా జీఎం కొండ య్య తన కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య, ఎస్‌వోటూ డైరక్టర్‌ అబుబ్‌ హూస్సేన్‌, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు, ఎస్‌వోటూజీఎం సాయిబాబు, ఏసీఎంవో అశోక్‌, ప్రాజెక్టు అధికారి శ్రీ రమేశ్‌, డీవైపీఎం రామాశాస్త్రీ, డీజీఎం(సివిల్‌) శివరాంరెడ్డి, హరీశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

మందమర్రి: కరోనా నియంత్రణకు సింగరేణి యా జమాన్యం ఎంతో కృషి చేస్తున్నదని సింగరేణి డైరెక్టర్‌ ఫైనాన్స్‌ బలరాం పేర్కొన్నారు. మందమర్రి ఏరియాలోని కేకే-1 గనిని బుధవారం ఆయన ఏరియా జీఎం శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డిస్పెన్సరీ వైద్యులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.  కరోనా చికిత్సకు ఇప్పటి వరకు తీసుకున్న దవాఖానలే కాకుండా మరో పది కార్పొరేట్‌ దవాఖానలతో ఒ ప్పందం కుదుర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌, డిఫ్యూటీ సీఎంవో శౌరీ, కార్పొరేట్‌ అధికారి అబీబ్‌హుస్సేన్‌, డీవైపీఎం శ్యాంసుందర్‌, కేకే 1 గ్రూప్‌ ఏజెంట్‌ రాంచందర్‌, పీఎం వరప్రసాద్‌, గని మేనేజర్‌ శంకర్‌, టీబీజీకేఎస్‌ నాయకులు రాజిరెడ్డి, రక్షణాధికారి లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.   


logo