కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మంత్రి నిరంజన్ రెడ్డి | వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 3,028 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
సంచికి 40 కిలోల 700 గ్రాముల ధాన్యం మాత్రమే తూకం వెయ్యాలన్నారు. తూకాల వద్ద పకడ్బందీగా వ్యవహరించి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతతో ధాన్యం తెచ్చిన రైతులను అభినందించి ప్రోత్సహించాలని సూచించారు.
వ్యవసాయం ఉన్నన్ని రోజులు రైతులకు ఏదో ఒక సమస్య ఉంటుందని..రాష్ట్రంలోని సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు.
అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ వద్ద ఉన్న టార్పాలిన్లు ధాన్యం కొనుగోలుకేంద్రాలకు తెచ్చుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ నిబంధనలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించాలని, ప్రజాప్రతినిధులు నిబంధనలు రైతులకు అర్థమయ్యేలా వివరించాలని నిరంజన్ రెడ్డి కోరారు.
వరి కోతలు పూర్తయిన తర్వాత రైతులు పొలాలలో గడ్డిని కాల్చవద్దన్నారు. అధికారులు రైతులను ఈ విషయంలో చైతన్యపర్చాలన్నారు. వానాకాలం సాగులో పత్తి, కంది సాగుతో పాటు సన్నవడ్ల సాగును పెంచాలన్నారు. ఇప్పటి నుండే ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలని అధికారులకు సూచించారు.
ఉపాధిహామీ కింద అన్ని గ్రామాలలో కాల్వల పూడికతీత పనులు వందశాతం పూర్తికావాలన్నారు. ఏ కారణం చేతనైనా పూడికతీత పనులు చేపట్టకపోయినా సంబంధిత సర్పంచ్, కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
తూతూమంత్రంగా పనులుచేసినా, పనులు చేపట్టకపోయినా సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

