బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Feb 04, 2020 , 01:02:07

సింగరేణికే తలమానికంగా నిలవాలి

సింగరేణికే తలమానికంగా నిలవాలి

రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్‌షిప్‌ లో గల సింగరేణి ఉన్నత పాఠశాల సింగరేణికే తలమానికంగా నిలవాలని కార్పొరేట్‌ (ఎఫ్‌అండ్‌ఏ) జీఎం ఎం నర్సింహారెడ్డి సూచించారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్‌షిప్‌లో సింగరేణి ఉన్నత పాఠశాల 37వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్కౌట్స్‌ అండ్‌ గైడ్‌ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాల యాజమాన్యం పుష్పగుచ్ఛం అందించి సాదర స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం  విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి పాఠశాలలో విద్యను అభ్యసించిన చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని, ప్రతి  విద్యార్థీ ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా సింగరేణి పాఠశాలల్లో విద్యనందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు సైతం ఆంగ్ల విద్యను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య మాట్లాడుతూ సింగరేణి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ పాఠశాలలో విద్యను అభ్యసించిన చాలా మంది విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడటం గోలేటి పాఠశాలకు గర్వకారణమని తెలిపారు. విశాలమైన పాఠశాల భవనం, ఆట స్థలం ఉందని తెలిపారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బహుహతులు సాధించారని తెలిపారు. ఈ యేడాది కూడా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, సేవా అధ్యక్షురాలు లక్ష్మీకుమారి, వినిత, పర్సనల్‌ మేనేజర్‌ ఐ.లక్ష్మణ్‌రావు, హెచ్‌ఎం సంతోశ్‌, పీఈటీ భాస్కర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు. logo