లోన్ యాప్స్ వేధింపులను తట్టుకోలేక..
సెలూన్ షాపు పెట్టుకునేందుకు గానూ లోన్యాప్స్ల ద్వారా తీసుకున్న అప్పు లు కట్టలేక..లోన్‌యాప్స్ నిర్వాహకుల వేధింపులను తట్టుకోలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది.
- చేసిన అప్పులను తీర్చలేక మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య
జడ్చర్లటౌన్, ఏప్రిల్11 : సెలూన్ షాపు పెట్టుకునేందుకు గానూ లోన్యాప్స్ల ద్వారా తీసుకున్న అప్పు లు కట్టలేక..లోన్‌యాప్స్ నిర్వాహకుల వేధింపులను తట్టుకోలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. జడ్చర్ల పోలీసులు, బా ధిత కుటుంబసభ్యులు కథనం ప్ర కారం జడ్చర్ల మండలంలోని నసుర్లాబాద్ గ్రామానికి చెందిన తరుణ్‌కుమార్(28) బతుకుదెరువు కోసం గోవాకు వెళ్లి కటింగ్ చేస్తూ బతికేవాడు.
కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా అక్కడి నుంచి స్వ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఫైస్టార్ బిజినెస్ ఫైనాన్స్‌లో రూ. 10లక్షలు, భారత్‌పే లోన్ యాప్‌లో రూ. 5లక్షలు, ఇతరాత్ర లోన్‌యాప్స్‌లో అప్పులు చేసి జడ్చర్లలో ఓ సెలూన్ షాపు పెట్టాడు. కానీ సెలూన్ షాపు సరిగా నడవకపోవటంతో చేసి న అప్పులు తీర్చలేకపోయాడు. లోన్‌యాప్స్ నుంచి తీసుకున్న అ ప్పులను తిరిగి చెల్లించకపోవటంతో ఆన్లైన్ లోన్‌యాప్స్ నిర్వాహకుల వేధింపులు మొదలయ్యాయి. దీంతో లోన్‌యాప్స్ వేధింపులను తట్టుకోలేక..మరోవైపు చేసిన అప్పులను తీర్చలేక మనస్థాపానికి గురై సెలూన్ షాపులోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
సెలూన్షాపునకు వెళ్లి న తన కుమారుడు తరుణ్‌కుమార్ ఇంటికి రాలేదని బెంగతో శనివారం ఉదయం ఆరా తీయగా, శుక్రవారం రాత్రి త రుణ్‌కుమార్ షాపులోనే ఉన్నాడని, మధ్యాహ్నం వరకు షాపు తెరవలేద ని షాపు చుట్టుపక్కల వారు తెలియజేశారు. దీంతో షాపు తెరచి చూడగా తరుణ్‌కుమార్ ఫ్యాన్ కు ఉరేసుకొని విగతజీవిగా ఉండటాన్ని గుర్తించా రు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వి చారణ చేపట్టారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చ ర్ల మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

