అభివృద్ధి పనులు, వివిధ రకాల సమస్యలను వెలుగులోకి తేవాలంటే పత్రిక జర్నలిస్టో, చానల్ రిపోర్టరో కానక్కర్లేదు.. సామాజిక స్పృ హ, స్పందించే తత్వం ఉండి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఎంతో సులువుగా మన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రపంచానికి తెలుపవచ్చు.. అలా కొందరు సోషల్ జర్నలిస్టుల అవతారం ఎత్తొచ్చు.. ఎక్కడేం జరిగినా క్షణాల్లో ఆ వార్తలను చేరవేస్తున్నారు.. ఓ ఫొటో కొట్టి సమస్యను నాలుగు పదాలతో పోస్టుచేసి అందరి దృష్టికి తీసుకొస్తున్నారు.. అవసరమైతే నేరుగా అధికారులు, ప్రజాప్రతినిధుల అకౌంట్లకు షేర్ చేస్తున్నారు.. ఇలా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీఒక్కరూ నయా జర్నలిస్టులుగా మారిపోతున్నారు.
– ఆత్మకూరు, ఆగస్టు 4
సోషల్ మీడియా అంటే కేవలం వినోదాత్మక మాధ్యమమే కాదు. నేడు వివిధ రకాల సమస్యల పరిష్కారానికో వేదిక. అందుకే ఇప్పుడు ఎంతోమంది సోషల్ జర్నలిస్టులు పుట్టుకొస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమపని తాము చేసుకుంటూనే సామాజిక మాధ్యమాల్లో నయా రిపోర్టింగ్ చేస్తున్నారు. సామాజిక స్పృహ, చుట్టూ పరిస్థితులపై అవగాహనతో ఎక్కడ ఏ సమస్య కనిపించినా, అభివృద్ధి పనులు జరిగినా వెంటనే స్పందిస్తున్నారు. చేతిలోని ఫోన్ తో ఓ ఫొటో కొట్టి ఆ వెంటనే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లోనూ పోస్టులు పెడుతున్నారు. అవసరమైతే ఏ అధికారికో, ప్రజాప్రతినిధికో పదేపదే షేర్ చేస్తున్నారు. మరి కొందరైతే అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. ఇంకొందరైతే అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో ఖరీదైన వైద్య చికిత్సలు చేయిస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. మరి కొందరేమో కాలనీల పేర, గ్రామాల పేర, పట్టణాల పేర గ్రూపులను ఏర్పాటు చేసి వాటిలో నిత్యం జరిగే వార్తల స్రవంతిపై పోస్టులు పెడుతూ ప్రజల్ని మేలుకొల్పుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశం చేస్తూ గ్రూపుల్లో నిత్యం వార్తల సమాహారాన్ని మోగిస్తున్నారు.
అందరూ మేలుకోసమే..
సోషల్ మీడియాలో విద్యార్థులు, యువకుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దాకా ప్రతిఒక్కరూ ఉంటున్నారు. కొందరు సమస్యలపైనా, ఇంకొందరు అభివృద్ధిపైనా, మరికొందరు సేవా కార్యక్రమాలపైనా దృష్టి సా రిస్తుండగా కొద్దిమంది చైతన్యం, మార్పులను ఆశిస్తూ పోస్టులు పెడుతున్నారు. ము ఖ్యంగా అభివృద్ధితోపాటు జనాలకి ఉపయోగపడే సమాచారం చేరవేస్తున్నారు. సా మాజిక మాధ్యమాల వేదికగా అన్నిరకాల వా ర్తలను తెరపైకి తెస్తున్నారు. గతుకుల రోడ్లు, ని ర్వహిస్తున్న అభివృద్ధి పనులు, అధ్వానపు డ్రైనేజీలు, వీధుల్లో వెలగని వీధిదీపాలు, తొలగని చెత్తకుప్పులు, కలుషిత నీరు, విద్య, వైద్యంతో పాటు ఎన్నెన్నో సమస్యలు, వివాదాలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఇలాంటి వాటిపై సంబంధిత అధికారు లు సహితం స్పందించి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఆయా సమస్యల పరిష్కారం తరువాత స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందనను సహితం అభినందిస్తూ నిర్వహిస్తున్న పనులకు హర్షం వ్యక్తం చేస్తూ అందరి మన్ననలు పొందేలా పోస్టులు పెడుతున్నారు.
చురుగ్గా అధికారులు, ప్రజాప్రతినిధులు..
సోషల్ మీడియా పుణ్యమా అని జిల్లా వ్యాప్తంగా ఉండే అధికారులు, ప్రజా ప్రతినిధులు కొంతమేర చురుగ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఎలాంటి వివాదాలు, సమస్యలు వచ్చినా వాటిని సత్వర పరిష్కారాలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేరువవుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తమ అభిప్రాయాలను వెల్లడించడంతోపాటు సమకాలిన రాజకీయాలు, తదితర అంశాలపై స్పందిస్తున్నారు. తాము నిత్యం పాల్గొనే కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు తెలపడం, అధికారులైతే తాము చేసే అభివృద్ధి, సమస్యల పరిష్కారాలను, తీసుకున్న చర్యలు పోస్టు చేస్తున్నారు. రాజకీయ నా యకులు తమ అభిమానులు, కా ర్యకర్తలతో నిత్యం ట చ్లో ఉంటున్నారు. అధికారులైతే తమ ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బందితో ఎప్పుడూ చాట్‌లో ఉంటున్నారు. వీరి కి వచ్చే పోస్టులకు కూడా స్పందిస్తున్నారు. సమస్యలకు తమ పరిధిలో పరిష్కారం చూపుతున్నారు. ఆపద సమయాల్లో అండగా నిలుస్తున్నారు. తమవంతు సా యం చేస్తూ భరోసా కల్పిస్తున్నారు.
గ్రూపులు, ప్రత్యేక పేజీలు..
ఒకే తరహా ఆలోచనలు, లక్ష్యాలు కలిగిన వారంతా ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా గ్రూపులు, పేజీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిలో లక్ష్యాలను నిర్దేశించుకుంటూ కలిసి వచ్చే వారిని యాడ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రోజువారీ తమ పనుల్లో బిజీగా ఉంటున్నా వాటికి ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. నమస్తే ఆత్మకూరు, తాజా వార్తలు, నిరుపేదలకు సహాయం, స్పాట్ న్యూస్, జనతాగ్యారేజ్, రాజకీయ ఐక్యవేదిక, యువసేన, మిత్ర మండలి, ఫర్ యూ, సేవామార్గం, మీకోసం మేము లాంటి ఎన్నో గ్రూపులతో సేవలందిస్తున్నారు. ఇంకా ప్రభుత్వ పథకాల పేర్లతో, గ్రామాల పేర్లతో, పార్టీల పేర్లతో, సంఘాల పేర్లతో, కు లాల పేర్లతో, ఉద్యోగ, ఉపాధ్యాయుల సం ఘాల పేర్లతో, నాయకుల పేర్లతో గ్రూపు లు, పేజీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం..
మనం ఏ పోస్టు చేసినా సామాజిక కోణంలో ఉండాలి. సమస్యలకు పరిష్కారం చూపాలి. నలుగురికి సాయపడాలి, పేదలకు భరోసా కల్పించాలి. అంతేగాని చేతిలో ఫోన్ ఉందికదా అని ఇష్టం వచ్చినట్లు పోస్టు చేయొద్దు. వ్యక్తిగత దూషణలకు వెళ్లడం, మతాలను కించపరచడం, ఇతరుల మనోభావాలను దెబ్బతీయం చేయకూడదు. ఇతరులకు షేర్‌చేసే ముందు కూడా ఓసారి సరి చేసుకోవాలి. అందులో ఉన్న విషయం వాస్తవమో కాదో ధ్రువీకరించుకోవాలి. లేదంటే ఆ పోస్టు వల్ల అనవసర వివాదాల్లో చిక్కుకునే ప్రమాదముంటుంది.
తప్పుడు పోస్టులకు చర్యలు తప్పవు..
మతాలను రెచ్చగొట్టడం, వర్గాలను విభజించడం, పార్టీలను ద్వేషిస్తూ వ్యతిరేకించడం, వ్యక్తులపై అకారణ దూషణలు చేయడం, వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం, అసభ్యం గా, వ్యం గ్యంగా అగౌరపర్చడం, ఇతరులకు ఇబ్బందులు కలిగించే పోస్టులు పెట్టడం తదితరవి చట్టరీత్యా నేరం. ఐటీ చట్టం 2000 ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరితం, రెచ్చగొట్టడం తదితర వ్యాఖ్యలు చేయ డం నేరం. ఇలాంటి వాటిపై ప్రత్యేకమైన నిఘాతో సైబర్ క్రైం పనిచేస్తుంది. గ్రూపు అడ్మిన్లు సహితం అప్రమత్తంగా ఉండాలి. చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించకుండా నిరంతరం గ్రూపులను పర్యవేక్షిస్తూ మంచి వాతావరణాన్ని నెలకొల్పాలి.
– వి. నరేందర్, ఎస్సై , ఆత్మకూరు