సీఎం కేసీఆర్‌కు జై కొడుతున్న యువకులు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి ఎంతో మంది యువకులు ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్‌రెడ్డిని పేర్కొన్నారు.
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పూడూరు, నవంబర్ 16: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి ఎంతో మంది యువకులు ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్‌రెడ్డిని పేర్కొన్నారు. గురువారం పూడూరు మండలం పెద్ద ఉంమ్మెతాల్, చీలాపూర్, దండుగడ్డ, తిమ్మాపూర్, కండ్లపల్లి, బాకాపూర్, మన్నెగూడ, ఎన్కెపల్లి, మీరాజపూర్, మైసమ్మగడ్డతాండ తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథ కాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వెంటనే వృద్ధులకు, దివ్యాంగులకు పింఛను రూ. మూడువేలకు బదులు రూ.ఐదువేలు అందజే యనున్నట్లు తెలిపారు. గతంలో గ్రామాల్లోని మహిళలు తాగు నీటికోసం గొడవలు పడేవారని కేసీఆర్ సీఎం అయ్యాక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి నీటి కష్టాలను తీర్చారని చెప్పారు.
రైతులకు 24గంటల విద్యుత్, రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి తదితర సంక్షేమ పథకాలను కేసీఆర్ అందజేసినట్లు గుర్తుచేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియాన్ని అందజేస్తామని వివరించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, రైతు బంధుసమితి కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, ప్రభాకర్‌గుప్తా, శ్రీధర్‌గుప్తా, గోవర్ధన్‌రెడ్డి, వినోద్‌గౌడ్, శ్రీనివాస్‌గుప్తా, అదిల్, శివయ్య, సత్యనారాయణరెడ్డి, దయాకర్, వేణు గోపాల్, యాదమ్మ, నర్సింహ్మరెడ్డి, సురేందర్‌గౌడ్, శంకరయ్యగౌడ్, బాలయ్య, హకీమ్, శేఖర్‌గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే సతీమణి ప్రచారం…
గండీడ్, నవంబర్ 16: చెప్పుడు మాటలు విని మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమైతారని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లి, జానంపల్లి, కప్లాపూర్, గొల్లగడ్డ, మన్సుర్పల్లి తండ, కొం డాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి గండీడ్ నుం చి మహేశ్‌రెడ్డికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, పీఏసిఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యా నాయ క్, ఎంపీటీసీ బాలకిష్టయ్య, సర్పంచ్‌లు హన్మంతు, రవికు మార్, లక్ష్మిబాయి, వనజ, శ్రీనివాస్, నాయకులు గోపాల్‌రెడ్డి, బాలవర్ధన్ రెడ్డి, రాంచంద్రారెడ్డి, వెంకటయ్య, శ్రీనివాస్, బాలవర్ధన్‌రెడ్డి, ఖాదర్, రమేశ్‌రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

