అమ్రాబాద్, జూన్ 21 : పదర మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని గ్రామ యువకులు డిమాండ్ చే శారు. శుక్రవారం విద్యార్థులతో కలిసి గ్రామ యువకులు పదర-మద్దిమడుగు ప్రధాన రహదారిపై రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులుగా మధ్యాహ్న భోజనం వడ్డించడం లేదని, దీంతో విద్యార్థులు ఆకలితోనే ఉంటున్నారన్నారు.
హెచ్ఎంను అడిగితే ఇంటికెళ్లి తిని రావాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, గ్రామస్తులు వెళ్లి అడిగినా ఆయన నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎంఈవో బాలకిషన్ విద్యార్థులకు వెంటనే మధ్యాహ్న భోజనం ఏర్పా టు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, వివేకానంద యు వజన సంఘం అధ్యక్షుడు ప్రశాంతాచారి, రా మ్యాదవ్, రమేశ్‌యాదవ్ పాల్గొన్నారు.