వనపర్తి, జూలై 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి బాలుర మైదానంలో శంకుస్థాపన చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన శిలాఫలకానికే దిక్కుముక్కు లేకుండా పోయింది. దాదాపు 4 నెలలు గడిచినా ఇంత వరకు అతీగతీ లేదు. నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో సీఎం శంకుస్థాపనలు కూడా ఇంతేనా అన్న చర్చ జరుగుతున్నది.
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భా గంగా రాష్ట్రంలోని అక్కడక్కడ ఈ నిర్మాణాలు కార్యరూ పం దాల్చాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి, రెండో దశల పేరుతో వివిధ చోట్ల సీఎంతోపాటు ఇతర మంత్రులు శంకుస్థాపనలు చేశారు.
అంతర్జాతీయ విద్యను అందిస్తామంటూ ఈ నూతన విద్యా వ్యవస్థను అమలులోకి తెచ్చారు. 5 నుంచి 12 తరగతుల వరకు ఏర్పాటు చేయనున్న ఈ పాఠశాలను త్వరితగతిన ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ పనుల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు.
వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా సీఎం రేవంత్రెడ్డి మార్చి 2న ప్రత్యేక సమయం కేటాయించారు. తాను విద్యాభ్యాసం చేసుకున్న వనపర్తిని అన్ని రకాలుగా అభివృద్ధ్ది చేస్తానని ప్రకటించారు. ఇం దులో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనతోపాటు ఇతరత్రా అనేక అభివృద్ధి పనులకు సైతం శిలాఫలకాలు వేశారు. శంకుస్థాపనల అ నంతరం ఆయా శాఖలకు చెందిన అధికారులు ఆ శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను తీసుకెళ్లి వారి కార్యాలయాల్లో భద్రపరుచుకున్నారు. సీఎం స్థాయిలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు అంటూ అప్పట్లో పెద్ద ఎ త్తున ప్రచారం కల్పించారు. శంకుస్థాపన చేసిన పనుల్లో ఏ ఒక్కటి నేటి వరకు కార్యరూపం దాల్చక పోగా కాగితాల రూపంలోనూ కదలడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం స్థలం గుర్తించినా సంబంధిత శాఖకు స్థలం అప్పగింత జరగలేదు. ప్రాథమికంగా స్థలం గుర్తించడం వరకే పరిమితమైంది. పూర్తి స్థాయిలో సర్వే చేయడం, బౌండరీలను ఏర్పాటు చే యడం వంటి పనులను చేపట్టలేదు. ముందు నుంచి రెండు, మూడు ప్రాంతాల్లో స్థలాలను రెవెన్యూ శాఖ ప్రతిపాదించినప్పటికీ ఎట్టకేలకు పెబ్బేరు రోడ్డులో వేసైడ్ మా ర్కెట్, మెడికల్ కళాశాలలను అనుసరించిన స్థలాన్ని చివరగా ఎంపిక చేశారు. దాదాపు 20 ఎకరాలంటున్నా.. స ర్వే చేసిన అనంతరం అక్కడ ఎంత భూమి ఉందో తెలిసే అవకాశం ఉన్నది.
ప్రస్తుతం ప్రాథమిక అంచనాలతోనే స్థల ఎంపిక చేశారు. దీనిపై రెవెన్యూ శాఖ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్కు ఎలాంటి ద్రువీకరణ పత్రం అందలేదు. ఇంజినీరింగ్ అధికారులు స్థల గు ర్తింపు జరిగిందని చెబుతున్నా.. ఎన్ని ఎకరాలు.. సర్టిఫైడ్ రూపంలో ఏదైనా ఉందా అని వాకబు చేస్తే.. అదేమీ రాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టెండర్ల దశ పూర్తి చేసుకుని, నిర్మాణ పనులు మొదలు కావాల్సిన తరుణంలో ఇంకా పనులన్నీ కింది స్థాయిలోనే నత్తనడకన సాగుతుండడంపై విమర్శలు వెలువడుతున్నాయి.
సీఎం రేవంత్ రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేసి నాలుగు నెలలు పూర్తయినా టెండర్లు ఎప్పుడు నిర్వహిస్తారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పుడప్పుడంటూ ఊరిస్తున్నారే త ప్పా..టెండర్లు నిర్వహించి నిర్మాణాలు ఎందుకు చేపడట్టం లేదని స్థానికులు విమర్శలు చేస్తున్నారు. కేవలం గత సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాల ద్వారా వచ్చిన మంచి పేరును లేకుండా చేయడం కోసమే ఇంటిగ్రేటెడ్ పేరుతో కొత్త వ్యవహారం తెరపైకి తెచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోగా, మళ్లీ కోట్లాది రూపాయలతో కొత్త పథకాలను ప్రకటిస్తూ శిలఫలకాలను వేస్తుండడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.