కొత్తకోట : అంతర్జాతీయ యోగా దినోత్సవం ( Internationa Yoga Day ) సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట ( Kottakota ) పట్టణం బాలికల ఉన్నత పాఠశాలలో గాడ్స్ ఆన్ వారియర్స్ షోటోకాన్ కరాటే అకాడమీ యోగాసనాలు నిర్వహించింది. అకాడమీ ఫౌండర్ అబ్దుల్ నబీ , క్లబ్ మాస్టర్స్ జాఫర్ సాదిక్, జి హరీష్ యాదవ్ విద్యార్థులకు యోగా ఆసనాలు చేయించారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలని, కరాటే కూడా యోగలో భాగమని అన్నారు. యోగాతో మానసికంగా, శారీరకంగా ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. కరాటే యోగ చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా నేర్చుకోవాలని సూచించారు.