మాగనూర్, ఏప్రిల్ 21 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభకు వెళ్లేందుకు నాయకులు సొంత వాహనాలతో పాటు నియోజకవర్గ ఇన్చార్జీల తరఫున ప్రత్యేకంగా వాహనాలను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి గ్రామం నుంచి ప్రత్యేకంగా వాహనాలను చేయనున్నట్లు పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గం నుంచే 30 బస్సులు, దాదాపు 100 వాహనాలు వరంగల్ సభకు తరలి వెళ్లనున్నాయని ఆయన పేర్కొన్నారు. 27వ తేదిన ఉదయం 6 గంటలకు అన్ని గ్రామాలు, వార్డులలో బీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ చేపట్టిన తర్వాత తమకు కేటాయించిన బస్సుల్లో, వాహనాల్లో వరంగల్ సభకు తరలి రావాలని సూచించారు.