ధన్వాడ, అక్టోబర్ 4 : క్రీడాకారులు క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సూచించారు. మండలకేంద్రం లో రెండురోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్ 14,17 రెజ్లింగ్ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాల నుంచి 300మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే పేట వారం రోజుల పాటు ని ర్వహించే వన్య ప్రాణి సంరక్షణ వారోత్సవాలను ఎమ్మెల్యే మండల కేంద్రంలో ప్రారంభించారు.
అనంతరం గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్ద్దేశ్యంతోనే రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలను మండల కేంద్రంలో నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నారాయణ పేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, వైస్ చైర్మన్ హ న్మంతు, డీవైఎస్వో వెంకటేశ్, రెజ్లింగ్ జిల్లా కార్యదర్శి నర్సింహులు, బాల్రాజ్, ఎంపీడీవో సాయి ప్రకాశ్, నాయకులు ఉదయభాను, నరహరి, సూర్యమోహన్ రెడ్డి, సాయినాథ్, నర్సింహాచారి, రాజశేఖర్, శ్రీనివాసులు, శివకుమార్