MLA Anirudh Reddy | ప్రశ్నిస్తేనే పనులు జరుగుతయ్.. ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దం : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MLA Anirudh Reddy | నా జడ్చర్ల ప్రజలు ఇబ్బంది పడితే నేను ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నా. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం నేనెంత దూరమైనా కానీ కొట్లాడతానన్నారు.
MLA Anirudh Reddy | కోమటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేం లేదు. నేను కూడా సమస్యల గురించి చాలా సార్లు మాట్లాడాను. సమస్యలున్నాయి.. వాటిని పరిష్కరించుకుంటే మా పార్టీకే మంచి పేరొస్తది కదా.. అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కామెంట్స్ చేశారని తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ పాలన ఎలా ఉందో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా మరోసారి చేసిన కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి. మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేను ఇప్పటికే చెప్పాను. మా దగ్గర రోడ్లు, ఇతర పనులు ఆగిపోయాయి.. బిల్లులు కావాలే.. దానికి పోరాటం చేయాలి. ప్రజల కోసం పోరాటం చేసేదాంట్లో తప్పేం లేదు. నా జడ్చర్ల ప్రజలు ఇబ్బంది పడితే నేను ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నా. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం నేనెంత దూరమైనా కానీ కొట్లాడతానన్నారు.
భట్టి దగ్గరకు బిల్లులు కావాలంటే కొట్లాడుతా.. ఏముంది నేను ఇంట్లో మా నాయనతో కొట్టాడనా..? అట్లనే ఆయన దగ్గరకు పోయి కొట్లాడతా. తప్పేముంది.. ఇయ్యకుంటే నేను దీక్షలో కూడా కూర్చుంటా. ఇందులో తప్పేముంది. ఇది ప్రజాస్వామ్యం. అంబేద్క్రర్ రాసిన రాజ్యాంగం ఇది.. ప్రశ్నిస్తూనే ఉండాలి.. మన పని జరిగేవరకూ.. అంబేద్కర్పైన గౌరవముంది. ఆ గౌరవంతోనే నేనెప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటాను. నా జడ్చర్ల నియోజకవర్గ ప్రజల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటా.. కొట్లాడతానే ఉంటానన్నారు.
నా నియోజకవర్గానికి రావాల్సిన నిధుల కోసం మా ప్రభుత్వంపై కొట్లడుతాను, వాళ్ళని ప్రశ్నిస్తాను
నా నియోజకవర్గ ప్రజల కోసం భట్టి విక్రమార్క దగ్గరికి వెళ్లి కొట్లాడుతాను
నిధులు ఇవ్వకుంటే దీక్షలో అయినా కూర్చుంటాను
మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి
– జడ్చర్ల కాంగ్రెస్… https://t.co/Dec3YTt9YS pic.twitter.com/iCzHV2Yh61
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2026
Read Also :
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

