Marikal | మరికల్, జూలై 09 : కేంద్ర ప్రభుత్వం కార్మికులను నష్టపరిచే విధంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మరికల్ మండల కేంద్రంలో సిఐటియు, టియుసిఐ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు, టియుసిఐ కార్మిక సంఘం నాయకులు సలీం, దస్తా మాట్లాడుతూ.. అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజన, గ్రామపంచాయతీ కార్మికులకు నష్టం జరిగే విధంగా ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరికల్ మండల కేంద్రంలో ర్యాలీని నిర్వహించిన అనంతరం స్థానిక చౌరస్తాలో కార్మికులు నిరసన వ్యక్తం చేసిన అనంతరం తాసిల్దార్ కార్యాలయం వరకు చేరుకొని తాసిల్దార్ రామ్ కోటికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.