మక్తల్, అక్టోబర్ 6 : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వివరించడంతోపాటు కాంగ్రెస్ హామీల బాకీ కార్డు ప్రజలందరికీ చేరువయ్యే లా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. నర్వ మండలకేంద్రంలో సో మవారం పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నర్వ బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తల కార్యచరణ సమావేశానికి మాజీ ఎమ్మె ల్యే చిట్టెం ముఖ్యఅతిథిగా హాజరై, కార్యకర్తలకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల గ్యా రెంటీ కార్డు ప్రకారం ప్రజలకు ఇవ్వాల్సిన బాకీలన్నింటిని, కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత, ప్రతి కార్యకర్తపై ఉందని సూ చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో ప్రతి ఒక కార్యకర్త బీఆస్ఎస్ అభ్యర్థుల విజయానికి, సైనికుడిలా పనిచేయాలని పిలుపుననిచ్చారు. కార్యకర్తల సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నా యకులు విజయ్, జనార్దన్, శేఖర్, వెంకటయ్య, శివ, నాగరాజు, తిప్పరెడ్డి, చెన్నరెడ్డి తదితరులు ఉన్నారు.