నాగర్‌కర్నూల్, జూన్ 4 : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం దవాఖాన ఎదుట ప్రధాన రహదారిలో అంబేద్కర్ కూడలిలో ధర్నా నిర్వహించారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన వనజ (25) కాన్పు కోసం నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు మంగళవారం వచ్చింది. పరీక్షించిన డాక్టరు నిలకడగా ఉందని చెప్పారు.
అనంతరం మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం విపరీతంగా కాళ్లు లాగడం మొదలై ఎంతకూ తక్కువ కాకపోవడంతో పరిస్థితి విషమించేలా ఉందని హుటాహుటిన మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించగా అక్కడ బా లింత మృతి చెందింది. దీంతో నాగర్‌కర్నూల్‌లోని ప్రైవేట్ దవాఖానలోనే వైద్యం వికటించిందని కుటుంబ సభ్యులు ఆగ్రహంతో బుధవారం మృతురానికి కుటుంబానికి న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.
శిశువు నాగర్‌కర్నూల్‌లో ఉండడం వనజ మృ తదేహం హైదరాబాద్‌లో ఉండడం, దీనంతటికి ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యమేనంటూ మండిపడ్డారు. దవాఖాన యా జమాన్యం పట్టించుకోకపోవడంతో ప్రధాన రహదారిపై అంబేద్కర్ కూడలి వద్ద అరగంటపాటు ధర్నా నిర్వహించారు. దీంతో అటు అచ్చంపేట, శ్రీశైలం వైపు, ఇటు హైదరాబాద్, మహబూబ్‌నగర్ వైపు వాహనాలు బారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికు పోలీసులు నచ్చజెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.