గద్వాల అర్బన్, డిసెంబర్ 1 : మత్తు మందు వికటించి మహిళ మృతిచెందిన ఘ టన జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. అయిజకు చెం దిన కవిత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో గత నెల 26న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. పరీక్షించిన వైద్యుడు ఆపరేషన్ చేయాలని, ఇక్కడ సరైన సదుపాయం లేదని ప్రైవేట్ దవాఖానను ఆశ్రయించాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని శివబాలాజీ దవాఖాన వైద్యులను కవిత ఆ శ్రయించింది.
వైద్యులు పరీక్షించి 28వ తేదీన ఆపరేషన్ చేసేందుకు మత్తు సూది ఇచ్చారు. దీం తో కవితకు ఫిట్స్ వచ్చి పరిస్థితి విషమించింది. వెంటనే కర్నూల్‌కు దవాఖానకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించడంతో అక్కడి వెళ్లగా పరీక్షించిన వైద్యులు మెదడులో నరాలు చిట్లి కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతిచెందింది. కవిత మృతికి కారణమైన శివ బాలాజీ దవాఖాన ఎదుట బాధిత కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.