ధరూరు, డిసెంబర్ 19 : భర్త చేతిలో భార్య దా రుణహత్యకు గురైన ఘటన మండలంలో నెట్టెంపాడులో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెట్టెంపాడు గ్రామానికి చెందిన గోవిందు, కుర్వ జములమ్మ(28) భార్యాభర్తలు. అయితే వీరి మధ్య గురువారం రాత్రి భోజనాలు చేసి ఇంట్లో పడుకున్న తర్వాత చిన్న విషయంలో భార్యాభర్తల మధ్య వాదులాట జరిగింది.
ఈ విషయంలో వారి పెద్ద కుమారుడు మల్లికార్జున్ తల్లిదండ్రులను వారించే ప్రయత్నం చేయగా గోవిందు కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్రతో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యా యి. దీంతో జమ్ములమ్మ కేకలు వేయడంతో.. బయట స్థానికులు తలుపులు బద్ధలు కొట్టి లోపల వెళ్లి గోవిందును నిలువరించినా వినకుండా భార్యను వెంటాడి కర్రతో కొట్టి హత్య చేశాడు. గాయపడిన కుమారుడిని దవాఖానకు తరలించారు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని జములమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించారు. అయితే గోవిందు సైకోగా వ్యవహరిస్తూ నిత్యం భార్యతో గొడవపడేవాడని స్థానికులు పోలీసులకు తెలియజేశారు.