మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 10 : మార్పు.. మా ర్పు అంటూ కాంగ్రెస్‌ను గెలిపిస్తే గద్దెనెక్కిన రేవంత్ గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మాయ చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ తెలంగాణ తల్లి ఆకృతిని ఎందుకు మార్చారని దుయ్యబట్టారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్ర తీక అన్నారు. సమాజానికి కావాల్సింది బతుకు దెరువు.. అది వదిలేసి మార్పులు.. చేర్పులు చేయడమేమిటని నిలదీశారు. రైతులకు రుణమాఫీ కావాలి.. ఎకరాకూ రూ.15 వేలు ఇవ్వాలి.. వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యాలి.. పాలమూరు ప్రజలకు తాగు, సాగునీరు కావాలి.. యాదవులకు ఇస్తామన్న రూ.2 లక్షలు ఖాతాల్లో జమ చేయాలి..
ముదిరాజ్‌లకు చేపపిల్లలు అందించాలి.. ఆటో లు, లూనాలు ఇవ్వాలి.. ఎస్సీలకు దళితబంధు కింద రూ. 10 లక్షలు ఇవ్వాలి.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇవ్వాలి.. అన్నారు. కులవృత్తులను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్‌దే అన్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త వాటితో కాలం వెల్లదీస్తున్నారన్నారు. గతంలో కొత్త రాష్ర్టాలు ఏర్పడినా ఎక్కడ కూడా చరిత్రను మార్చలేదని గుర్తు చేశారు. ప్రకృతిని పూజించే చరిత్ర తెలంగాణలో ఉన్నదని, అలాంటి చరిత్ర తెలంగాణ తల్లిలో ఉన్న బతుకమ్మను ఎందుకు మార్చారో ప్రజలకు తెలియజేయాల్సిన అ వసరం ఉన్నదన్నారు. పక్క రాష్ట్రంలో ఎక్కడా పేర్లు మార్చలేదు.. కాని తెలంగాణలో టీఎస్‌ను టీజీగా మార్చారన్నా రు. మార్చాల్సింది పేర్లు కాదు.. ప్రజల తలరాతలు మార్చాలని హితవు పలికారు.
వివాదాలు సృష్టించడం.. అక్రమ కే సులు బనాయించడం.. బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపడం.. ఇదేనా మార్పం టే అని నిలదీశారు. మీరు చేస్తామన్న మా ర్పుల కోసం ప్రజలు మీకు ఓట్లేయలేదు.. మీరిచ్చిన హామీలను చూసి ఓట్లేశారని గమనించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక సంపద దిగజారిపోయిందని ఆయన ఆ వేదన వ్యక్తం చేశారు. రాహుల్, సోనియా, ప్రి యాంక వచ్చి ప్రకటించిన హామీలపై దృష్టి సా రించాలన్నారు. స్థానిక సంస్థలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కార్యాచరణ ప్రకటిస్తామని, వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ వి జయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చై ర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెం కన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ఆంజనేయులు, కౌన్సిలర్ గణేశ్, అ నంత్రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్, సా యిలు, రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.
తల్లిని మార్చిన ఘనుడు
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, డిసెంబర్ 10 : కాంగ్రెస్ వస్తే మార్పు తీసుకొస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి నేడు తెలంగాణ తల్లిని మార్చిన ఘనుడుగా చరిత్ర పుటల్లోకి ఎకారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అస్తిత్వం జోలికొస్తే తరిమి కొడుతామని ఆయన హెచ్చరించారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని హైవేపై తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి ఆయన క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తెలంగాణ తల్లిని అవమానపర్చుతూ కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలు సైతం లెకచేయకుండా పోరాట పటిమతో తెలంగాణ సాధించినట్లు గుర్తు చేశారు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు అభివృద్ధి చేసి దేశానికే తలమానికంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. నాడు కాంగ్రెస్ పాలకుల విగ్రహాలను చెరిపేయాలనుకుంటే కేసీఆర్‌కు క్షణం పట్టేది కాదన్నారు.
తెలంగాణ తల్లిని చకగా రూపొందించి విగ్రహాలను ప్రతిష్టిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే విగ్రహంలో బంగారు హారాలను, తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను తొలగించడం సరికాదన్నారు. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ ముద్రలను చెరిపేయాలని లక్ష్యంతో రేవంత్ చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేదన్నారు. రేవంత్ తన కుటుంబాన్ని చకదిద్దుకుంటున్నారే తప్పా ప్రజల బాగోగు లు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడే సమయం దగ్గర్లోనే ఉన్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మక్తల్, మాగనూరు మండలాల అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు రాములు, మొగులప్ప, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, నాయకులు హనుమంతు, ఆశిరెడ్డి, గాల్‌రెడ్డి, శంకర్, నారాయణరెడ్డి, నర్సింహారెడ్డి, మారుతిగౌడ్, నరసింహారెడ్డి, అన్వర్, రవికుమార్, సాగర్, ఈశ్వర్ యాదవ్, రాజు, నర్సింహులు, మన్నన్, కృష్ణ, అశోక్‌గౌడ్, ఆనంద్, సాధిక్, అశోక్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.