మరికల్, అక్టోబర్ 25: బీఆర్ఎస్ హయాంలో గడపగడపూ సంక్షేమ పథకాలు అందాయని, మరికల్ మండలంలో ఎంతో అభివృద్ధి చేశామని, అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి పరుస్తానని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పుసల్పాడ్, రాకొండ, పెద్దచింతకుంట, వెంకటాపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాబోవు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తాయని, అలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతకుమందు గ్రామాల్లో ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ధన్వాడ, అక్టోబర్ 25: నారాయణపేట ఎమ్మెల్యేగా తిరిగి గెలిపిస్తే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చీకర్లగడ్డతండా, చర్లపల్లి, హన్మన్పల్లిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్.ఆర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని ఇవ్వాలని ప్రజలకు కోరారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తిరిగి చీకటి రోజులు వస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విమాలాదేవి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు వాహిద్, పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్, మురళీధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నాగిరెడ్డి, వెంకటయ్య, అంజియాదవ్, సర్పంచులు నారాయణరెడ్డి, రాజునాయక్, గోవింద్‌నాయక్, రాములు, పూర్యనాయక్, సచిన్, సునిల్‌రెడ్డి, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.