మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్ ( Mahabub Nagar ) జిల్లా ప్రాజెక్టులను ( Irrigation Projects ) అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి పూర్తి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupally Krishna Rao ) అన్నారు. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ప్రధాన భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పంప్ హౌస్, ప్యాకేజీ 3 వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి ప్రాజెక్ట్ లను సందర్శించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.